వెంకటేష్ గౌడ్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన ర్యాలీ

వెంకటేష్ గౌడ్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

భూత్పూర్ చౌరస్తాలో బీసీ సంఘాలు, 

బిఆర్‌ఎస్ నేతల అధ్వర్యంలో ర్యాలీ, నిరసన

భూత్పూర్, జనవరి 24( మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని మదిగట్ల గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్‌పై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపతిరెడ్డిలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ మండలాల నుంచి వచ్చిన బీసీ సంఘాల నాయకులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం భూత్పూర్ చౌరస్తా నుంచి ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ, వెంకటేష్ గౌడ్ పై దాడి వ్యవహారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యువత అధ్యక్షుడు భూపతి రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్ నాయకులు, బసవరాజు గౌడ్, నారాయణ గౌడ్, సత్యనారాయణ, నరేష్ గౌడ్, శ్రీనివాస్, రమేష్, రాజు, మేకల శ్రీనివాస్ రెడ్డి, గోప్లాపూర్ శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ సాధిక్, నర్సింలు, చంద్రశేఖర్ గౌడ్, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన బీసీ యువకులు, సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. వెంటనే న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Previous Post Next Post