ఐమాక్స్ లైట్లతో పాఠశాలకు సాయంత్రం వేళల్లో వెలుగులు

 ఐమాక్స్ లైట్లతో పాఠశాలకు సాయంత్రం వేళల్లో వెలుగులు

మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత లక్ష్మినర్సింలు

బాదేపల్లి హైస్కూల్ గ్రౌండ్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

జడ్చర్ల రూరల్, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): ఐమాక్స్ లైట్ల ఏర్పాటు వల్ల పాఠశాల గ్రౌండ్‌తో పాటు పరిసర ప్రాంతాలు సాయంత్రం వేళల్లో వెలుగులతో నిండుతాయని మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత లక్ష్మినర్సింలు తెలిపారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో పట్టణంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాల బాలుర బాదేపల్లి గ్రౌండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐమాక్స్ (హైమాస్ట్) లైట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత లక్ష్మి నర్సింలు శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులు, ఈ ఐమాక్స్ లైట్ల ఏర్పాటు వల్ల పాఠశాల గ్రౌండ్‌తో పాటు పరిసర ప్రాంతాలు సాయంత్రం వేళల్లో వెలుగులతో నిండుతాయని తెలిపారు. విద్యార్థులు క్రీడా సాధన, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు సురక్షితంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఐమాక్స్ లైట్ల ప్రారంభంతో బాదేపల్లి హైస్కూల్ గ్రౌండ్ విద్యా క్రీడా కార్యకలాపాలకు కేంద్రంగా మారనుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొని పాఠశాల అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి, చైర్‌పర్సన్ కి, మున్సిపల్ కమిషనర్ కి, వార్డు కౌన్సిలర్ కి కృతజ్ఞతలు తెలిపారు. 





Previous Post Next Post