రామాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు...

 రామాలయంలో శాస్త్రోక్తంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు....

నాగర్ కర్నూల్, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పుష్య పౌర్ణమి సందర్భంగా శనివారం నాడు నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా వేదమంత్రోచరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజాన్ అయ్యంగార్ తెలిపారు. సూక్ష్మంగా మోక్షమార్గం పొందుటకు భగవంతుని కృపాకటాక్షాలకు కలియుగ ఆరాధ దైవమైన విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి వారిని భక్తి యుక్తంగా కొలవాలని ఆయన సూచించారు. 16 మంది దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయని అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ధనుర్మాసం కావడంతో హోదా దేవి మాతకు ప్రత్యేకంగా పాశుర పఠనం, తిరుప్పావై సేవా కాలం, మహా మంగళహారతి వివిధ నక్షత్ర హారతులు ప్రత్యేక తీర్థ ప్రసాదాల గోష్టి నిర్వహించారు.రామాలయ అన్నప్రసాద కమిటీ వారిచే పాల్గొన్న భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ అర్చకులు కందాడై శ్రీనివాసచార్యులు, కరుణశ్రీ, గోమట మురళీమోనాచార్యులు శ్రీనివాసచార్యులు, రవీందర్, మల్లేష్, రమాదేవి ,శారద, మన్యపు రెడ్డి, గొల్ల రాములు,మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






Previous Post Next Post