సేవ చేయడంలోనే సంతృప్తి
ఎస్సై కృష్ణదేవ
ఉరుకొండ, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): మండలంలోని ఊరుకొండపేట అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఎస్సై కృష్ణదేవ పావని దంపతులు భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సై కృష్ణదేవ సమకూర్చిన నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి, భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై కృష్ణదేవ మాట్లాడుతూ అన్నదానం చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని, శ్రీ అభయాంజనేయస్వామి కృపతో ఈ సేవ చేయగలిగినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఎస్సై దంపతుల సేవా దృక్పథాన్ని భక్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
