పాలెం వెంకన్న ఆలయంలో వైభవంగా గోదాదేవి కళ్యాణోత్సవం
భోగి పర్వదినాన శాస్త్రోక్తంగా నిర్వహించిన కళ్యాణం – ముగిసిన ధనుర్మాస ప్రత్యేక పూజలు
బిజినపల్లి, జనవరి 15 (మన ఊరు ప్రతినిధి): మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భోగి పర్వదినాన్ని బుధవారం గోదాదేవి–రంగనాయక స్వామి వారి కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. గత నెల రోజులుగా ఆలయంలో ఆలయ ధనుర్మాస ప్రత్యేక పూజలు విజయవంతంగా ముగిశాయని ప్రధాన అర్చకులు కురవి రామానుజాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ తెల్లవారుజామున గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. ధనుర్మాస చివరి రోజున అంగరంగ వైభవంగా గోదాదేవి కళ్యాణోత్సవం నిర్వహించడం విశేషం. ఆలయ ధర్మకర్త మనుసాని విష్ణుమూర్తి, ఆలయ ఈవో సి.హెచ్. రంగారావు పర్యవేక్షణలో అర్చకులు జయంత్, శుక్ల, వేణుగోపాల్, చక్రవర్తి వేదమంత్రోచ్చారణల నడుమ కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ–ప్రసాదాలు అందజేయడంతో పాటు, గోదాదేవి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు సొప్పరి రాములు–కృష్ణమ్మ దంపతులు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. చేశారు. చేశారు. చేశారు. చేశారు. చేశారు. చేశారు. చేసారు. ఈ కార్యక్రమంలో బండారు జగదీష్, ఆలయ సిబ్బంది బాబయ్య, శివకుమార్, పురుషోత్తంతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని స్వామివార్ల కృపకు పాత్రులయ్యారు. ఇదిలా ఉండగా, ఈ నెల 20 నుంచి 2 వరకు పాలెం వెంకన్న దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి7 ఆలయ అధికారులు.









