కల్వకుర్తి మున్సిపాలిటీకి తుది ఫోటో ఓటర్ జాబితా విడుదల
కల్వకుర్తి, జనవరి 16 (మనఊరు ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించిన 44 పోలింగ్ స్టేషన్ల తుది ఫోటో ఓటర్ జాబితా (Final Photo Electoral Roll)ను మున్సిపల్ కమీషనర్ మహముద్ షేక్ శుక్రవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, విడుదల చేసిన ఫోటో ఎలక్టరల్ రోల్స్‌ను కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డుపై ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతి ఓటరు తమ పేరు, వివరాలు పరిశీలించుకుని ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే సంబంధిత వార్డు అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (TPO) వికాస్, VLP మేనేజర్ రాజ కుమారి నోరి, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
