ఊరుకొండపేట ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రత్యేక పూజలు

 ఊరుకొండపేట ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రత్యేక పూజలు

కల్వకుర్తి, ఉరుకొండ, జనవరి 20 (మనఊరు ప్రతినిధి): ఉరుకొండ మండలంలోని ఊరుకొండపేటలో శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు గత రెండు రోజులుగా భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ… శ్రీ ఆంజనేయ స్వామి కృపతో ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలాజీ సింగ్, ఆనంద్ కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, యా. నరసింహ, సంజీవ్ కుమార్ యాదవ్, బచ్చు రామకృష్ణ, గూడూరు శ్రీనివాస్ రెడ్డి, గోళీ సురేందర్ రెడ్డి, జీడిపల్లి సర్పంచ్ కెంచ ఆంజనేయులు, శ్రీపురం హరీష్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.

Previous Post Next Post