షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణకు శాలువాతో ఘన సన్మానం
మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపిన అసిఫ్ అలీ, గుజ్జుల మహేష్
షాద్‌నగర్, జనవరి 9 (మనఊరు ప్రతినిధి): షాద్‌నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) లక్ష్మీనారాయణని రేవంత్ రెడ్డి మిత్ర మండలి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అసిఫ్ అలీ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తలోకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గుజ్జుల మహేష్ కూడా పాల్గొని ఏసీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ శాఖలో శాంతి భద్రతల పరిరక్షణలో ఏసీపీ లక్ష్మీనారాయణ గారి సేవలు అభినందనీయమని వారు పేర్కొన్నారు. ప్రజల భద్రతకు అంకితభావంతో పనిచేస్తున్న పోలీస్ అధికారులను ప్రోత్సహించడం అవసరమని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.
