లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ..!

 లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ..!

సోషల్ మీడియా మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 సీఐ నాగార్జున, ఎస్సై మాధవరెడ్డి

కల్వకుర్తి, జనవరి 15 (మనఊరు ప్రతినిధి): వాట్సాప్ గ్రూపుల్లో మీకు రూ.3 వేలొచ్చాయి… మీరు కూడా ప్రయత్నించండి… పది మందికి ఫార్వర్డ్ చేయండి అంటూ వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి. చేయకండి. చేయవద్దని కల్వకుర్తి సీఐ నాగార్జున, ఎస్సై మాధవరెడ్డిలు ప్రజలకు సూచించారు.  సైబర్ నేరగాళ్లు అమాయకులను వలలో వేసుకొని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతూ డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అనుమానాస్పద లింకులు విస్తృతంగా వైరల్ అవుతున్నాయని, వాటిని క్లిక్ చేయండి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.  ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి లింకులు, ఆకర్షణీయమైన ఆఫర్లు నమ్మవద్దని, అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైం పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Previous Post Next Post