కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
అభివృద్ధి పనుల వేగవంతానికి ఎమ్మెల్యే కశిరెడ్డి సమీక్ష
కల్వకుర్తి, జనవరి 8 (మనఊరు ప్రతినిధి): ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తన నివాసంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన నాలుగు మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖల అధికారులు పాల్గొన్నారు. డీఈలు, ఎఈలతో ఎమ్మెల్యే కశిరెడ్డి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈలు నాగలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, మోహన్ రెడ్డి, అలాగే ఎఈలు కృష్ణయ్య, పరమేష్, అభిషేక్, సాయికిరణ్, విజయ్, శ్రావ్య, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.
