ఫ్యూచర్ సిటీ సీపీకి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అభినందనలు
కల్వకుర్తి జనవరి 8 (మనఊరు ప్రతినిధి): ఇటీవల ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జీ. సుధీర్ బాబును ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఆయన అధికారిక కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువా, పూలబొకేతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతనంగా ఏర్పాటు కానున్న ఆమనగల్ డివిజన్‌లో కడ్తాల పోలీస్ స్టేషన్‌ను కలపాలని, అలాగే ఆమనగల్ డివిజన్‌ను మహేశ్వరం జోన్‌లో విలీనం చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించాలని కోరిన ఎమ్మెల్యే, ఈ మార్పుల వల్ల ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
