బృంగి రత్నమాల నామినేషన్‌కు ఎమ్మెల్యే కసిరెడ్డి మద్దతు

 బృంగి రత్నమాల ఆనంద్‌కుమార్ నామినేషన్‌కు ఎమ్మెల్యే కసిరెడ్డి మద్దతు

కల్వకుర్తి, జనవరి 29 (మన ఊరు ప్రతినిధి): కల్వకుర్తి పట్టణంలో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా బృంగి రత్నమాల ఆనంద్‌కుమార్ నామినేషన్ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే వెంట బాలాజీసింగ్, భూపతి రెడ్డి, వర్కాల భాస్కర్ రెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నామినేషన్ దాఖలాలో భాగస్వాములయ్యారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడం ఖాయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బృంగి రత్నమాల ఆనంద్‌కుమార్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని నేతలు తెలిపారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పట్టణంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

Previous Post Next Post