కల్వకుర్తి మున్సిపాలిటీలో నామినేషన్ల హోరు
రెండో రోజే 57 దాఖలు… మొత్తంగా 71
కల్వకుర్తి, జనవరి 29 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎన్నికల సందడి ఊపందుకుంది. 22 వార్డులకు గాను రెండో రోజు బుధవారం 57 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న 14 నామినేషన్లు దాఖలుకాగా, రెండో రోజుతో కలిపి ఇప్పటివరకు మొత్తం 71 నామినేషన్లు స్వీకరించినట్లు కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ తెలిపారు. రెండో రోజు దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.. కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది, బీఆర్‌ఎస్ నుంచి 19 మంది, బీజేపీ నుంచి 9 మంది, బీఎస్పీ నుంచి ఒకరు, సీపీఐ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు 9 మంది నామినేషన్ల దాఖలకు రేపటితో ఒక్కరోజే గడువు మిగిలి ఉందని అధికారులు గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను బుధవారం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారంతో కలిపి అక్కడ మొత్తం 49 నామినేషన్లు దాఖలైనట్లు ఆమనగల్ మున్సిపల్ కమిషనర్ శంకర్ తెలిపారు.
