ఉద్యాన యాంత్రీకరణ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
అచ్చంపేట, జనవరి 6 (మనఊరు ప్రతినిధి): ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఉద్యాన యాంత్రీకరణ పథకం కింద పండ్ల తోటలు, కూరగాయ పంటలను సాగు చేస్తున్న రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలను అందజేయనున్నట్లు అచ్చంపేట ఉద్యాన అధికారి చంద్రశేఖర్, విస్తరణ అధికారి గోవర్ధన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.కీ టకాలు, తెగుళ్లు, కలుపు నివారణతో పాటు ఎరువుల పిచికారీ కోసం 40 నుంచి 50 శాతం రాయితీపై తైవాన్ స్ప్రేయర్‌ను అందించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మొక్కజొన్న తదితర పంటల పొలాలను దున్నడం, కలుపు తీయడం, మట్టిని మెత్తగా చేయడం కోసం 40–50 శాతం రాయితీపై పవర్ టిల్లర్, పవర్ వీడర్, బ్రష్ కట్టర్‌లను రైతులకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.ఈ పథకానికి ఆసక్తి, అర్హత కలిగిన రైతులు సమీప ఉద్యాన కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 8977714293, 8309610630 సెల్ నంబర్లను సంప్రదించాలని వారు కోరారు.
