ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కురుమూర్తి
44వ రాష్ట్ర మహాసభల్లో ఎంపిక
జడ్చర్ల రూరల్, జనవరి 6 (మనఊరు ప్రతినిధి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పాలమూరు జిల్లా జడ్చర్లకు చెందిన కార్యకర్త కురుమూర్తి నియమితులయ్యారు. శంషాబాద్‌లో ఇటీవల నిర్వహించిన 44వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షుడు ఆయనను ఈ పదవికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కురుమూర్తి మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఏబీవీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పదవికి కురుమూర్తి ఎంపిక కావడం పట్ల జడ్చర్లతో పాటు పాలమూరు జిల్లాలోని ఏబీవీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
