బంగారు, వెండి, కాంస్య పతకాలతో విద్యార్థుల సత్తా
జడ్చర్ల రూరల్, (మనఊరు ప్రతినిధి): హైదరాబాద్ పటాన్చెరువు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో లక్ష్యం చోటు ఖాన్ కరాటే అకాడమీ ఇండియా ఆధ్వర్యంలో, చీఫ్ ఆర్గనైజర్ అనిల్ యాదవ్ నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. పాలమూరు జిల్లా గంగాపూర్, కోడుగల్, లింగంపేట్ గ్రామాల్లో శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని బంగారు, వెండి, కాంస్య పతకాలు గెలుచుకున్నట్లు అకాడమీ ఫౌండర్ మాస్టర్ కేశవ్ గౌడ్ తెలిపారు. పోటీల్లో సునందిత, ధనుష్, నవీన్, మనోహర్, వరుణ్ బంగారు పతకాలు సాధించగా, సాత్విక్ రెడ్డి, సూర్యతేజ్ వెండి పతకాలు గెలుచుకున్నారు. అలాగే నికిత, జశ్వంత్, దర్శన్, విక్రమ్ కాంస్య పతకాలు సాధించి అకాడమీకి కీర్తి తీసుకొచ్చారు. గెలుపొందిన విద్యార్థులకు ఆల్ ఇండియా సీనియర్ మాస్టర్స్ మాస్టర్ కేశవ్ గౌడ్, మాస్టర్ నాగేష్, అమర్ సింగ్, కజావుద్దీన్, రంగు గణేష్ గౌడ్, సాయి యాదవ్, అనిల్ యాదవ్, దేవ్ గౌడ్, శివ కుమార్ యాదవ్, శ్రీనివాస చారి తదితరులు పతకాలు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల క్రమశిక్షణ, కఠిన సాధన వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని మాస్టర్ కేశవ్ గౌడ్ తెలిపారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేలా శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.
