పట్టటణంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

 జడ్చర్లలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ జోరు

నాలుగో రోజు 3వ వార్డులో విస్తృత పరిశుభ్రత పనులు

జడ్చర్ల, జనవరి 6 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మునిసిపల్ పరిధిలో చేపట్టిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో పట్టణంలోని మూడో వార్డులో విస్తృత స్థాయిలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ జి. లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు సతీష్, కుమ్మరి రాజు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ నరేష్, వార్డు ఆఫీసర్ కృష్ణయ్యతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్ల పరిశుభ్రత, డ్రైనేజీల శుభ్రపరిచే పనులను ముమ్మరంగా చేపట్టారు. పట్టణంలోని ప్రతి వార్డులో ప్రతిరోజూ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తామని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి తెలిపారు. అలాగే సరస్వతి నగర్ కాలనీలో 10 శాతం ఖాళీ స్థలాలను గుర్తించి శుభ్రపరచడంతో పాటు బౌండరీలను ఫిక్స్ చేయడం జరిగిందని వెల్లడించారు. పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు.



Previous Post Next Post