గురువయ్యగౌడ్‌కు కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా నియామకం

 గురువయ్యగౌడ్‌కు కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా నియామకం

మిడ్జిల్‌కు గర్వకారణమైన ఘనత

మహబూబ్‌నగర్, మిడ్జిల్ జనవరి 17 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ హైకోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో ఉత్తమ న్యాయ సేవలు అందిస్తున్న సీనియర్ న్యాయవాది బండారి గురువయ్య గౌడ్ ను కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా నియమించింది. ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గురువయ్య గౌడ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వివిధ కేసుల్లో హైకోర్టులో ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించి, న్యాయం చేకూర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నియామకం పట్ల ఆయన స్వగ్రామమైన మిడ్జిల్ మండలం వేముల గ్రామ ప్రజలు, బాల్య మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చినందుకు గురువయ్య గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. మా ఊరి బిడ్డ ఇంత ఉన్నత స్థాయికి ఎదగడం గర్వకారణం. చిన్ననాటి మిత్రుడిని ఈ స్థాయిలో చూడటం ఎంతో సంతోషంగా ఉంద అని బాల్య మిత్రులు శేఖర్, సీఐ అంజిరెడ్డి, మిడ్జిల్ సర్పంచ్ శంకర్, నాయకులు బుచ్చిరెడ్డి, కృష్ణ, సంపత్, ఉస్మాన్, తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.

Previous Post Next Post