ఆడబిడ్డ పెళ్లికి చేయూత
రూ.21 వేల నగదు, పట్టుచీర అందజేసిన దశరథ్ నాయక్
కడ్తాల్, జనవరి 4 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని సలార్‌పూర్ గ్రామానికి చెందిన సుల్తానా గఫూర్ జానీ దంపతుల కుమార్తె కౌసర్ బేగం వివాహానికి కడ్తాల్ మాజీ జెడ్పిటిసి, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దశరథ్ నాయక్ రూ.21,000 నగదు సహాయంతో పాటు పట్టుచీర అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే సలార్‌పూర్ గ్రామ సర్పంచ్ ప్రియా రమేష్ కూడా పెళ్లికూతురికి తమ వంతుగా రూ.21,000 నగదు సాయం అందజేశారు. ఈ సందర్భంగా పెళ్లికూతురు తల్లిదండ్రులు సుల్తానా–గఫూర్ జానీ మాట్లాడుతూ తమ కుమార్తె వివాహానికి సహాయం కోరగా వెంటనే స్పందించిన దశరథ్ నాయక్, ప్రియా రమేష్ పెద్దన్నల మాదిరిగా ఆదుకున్నారని పేర్కొన్నారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు దశరథ్ నాయక్, ప్రియా రమేష్‌లను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇలాంటి సహకారం అందించడం ఆదర్శనీయమని గ్రామస్తులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రియా రమేష్, బాబా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
