సంక్రాంతి పండుగకు పేద మహిళల ముఖాల్లో చిరునవ్వులు
1450 మందికి వంట సరుకుల పంపిణీ
జెకె కుటుంబ ట్రస్టు సేవాభావానికి గ్రామస్తుల ప్రశంసలు
నవాబుపేట, జనవరి 12 (మనఊరు ప్రతినిధి): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జెకె కుటుంబ ట్రస్టు ఆధ్వర్యంలో నవాబుపేట గ్రామంలోని పేద మహిళలకు సోమవారం వంట సరుకుల పంపిణీ జెకె ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన 1450 మంది మహిళలకు అవసరమైన నిత్యావసర వంట సరుకులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా జెకె ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, నవాబుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వి. నరసింహచారి మాట్లాడుతూ పండుగల వేళ పేద కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా వారి జీవితాల్లో ఆనందం నింపడమే ట్రస్టు ప్రధాన లక్ష్యమని తెలిపారు. సామాజిక సేవనే ధ్యేయంగా జెకె కుటుంబ ట్రస్టు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ట్రస్టు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పండుగ సందర్భంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గ్రామస్తులు ప్రశంసించారు.
