ఉద్యోగం జీతం కాదు.. బాధ్యత – సీఎం రేవంత్ రెడ్డి

 ఉద్యోగ కల్పన మా ప్రభుత్వ ప్రధాన బాధ్యత

యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం – సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 16 (మనఊరు ప్రతినిధి): రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగం అనేది కేవలం ఉపాధి కాకుండా యువత జీవితంతో ముడిపడి ఉన్న అత్యంత కీలక అంశమని ఆయన పేర్కొన్నారు.  గ్రూప్–3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు. గ్రూప్–1 ఉద్యోగాల భర్తీలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాని వల్ల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీపీఎస్సీ) విశ్వసనీయత దెబ్బతింది. అన్నారు. పోటీ పరీక్షలను సక్రమంగా నిర్వహించకపోవడం గత పాలకుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని.  ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం జీతం తీసుకోవడం మాత్రమే కాదని, అది ఒక భావోద్వేగం అని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. యువత ఆశలు, కలలను గౌరవిస్తూ తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. 

Previous Post Next Post