కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు

 బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

సీఎం రేవంత్‌రెడ్డి సంక్షేమ పథకాలకే ప్రజల మద్దతు

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు బాలాజీ సింగ్

కల్వకుర్తి 7వ వార్డులో బిఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులు కాంగ్రెస్ గూటికి

కల్వకుర్తి రూరల్, జనవరి 21 (మనఊరు ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు బాలాజీ సింగ్ తెలిపారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన 20 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలాజీ సింగ్ నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఏనుగొండ నరేందర్, పంబళ్ల కుమార్, సాదిక్, బీసా హుస్సేన్, కమటం మురళి, కమటం దామోదర్, చిన్న, ముత్యాల రమేష్, నేరటి పరుశరాములు, పోలె శివ, రఫీ, కిరణ్, నర్సింహా, విక్కీ, దొడ్డి శివ, అర్జున్, శివకుమార్, గద్ద శ్రీకాంత్, తోటపల్లి శివ, ఘవారియా అర్జున్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలాజీ సింగ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, అందుకే అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజాసేవలో ముందుండి పనిచేస్తామని నూతనంగా చేరిన నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, నాయకులు గోరేటి శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్లు శానవాజ్ ఖాన్, చిన్న రాంరెడ్డి, మబ్బు రామరాజు, నాయకులు సాదిక్, నవీన్, సంతు యాదవ్, చెన్న కేశవులు, మందుల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.







Previous Post Next Post