డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో డ్రైనేజీని పరిశీలన సర్పంచ్

 డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిశీలించిన సర్పంచ్ 

జడ్చర్ల రూరల్, జనవరి 7 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని చర్లపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని గ్రామ సర్పంచ్ జోగు లక్ష్మణ వెంకటరమణ బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమీపంలో మురుగు నీరు రోడ్డు పక్కనే నిలిచిపోవడంతో దుర్వాసనతో పాటు దోమల సమస్య తీవ్రంగా మారి, జ్వరాల బారిన పడే పరిస్థితి నెలకొనిందని కాలనీవాసులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణ వెంకటరమణ కాలనీవాసులతో మాట్లాడుతూ, డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను త్వరలోనే నిర్మిస్తామని, అలాగే తాత్కాలికంగా మురుగు నీరు కాల్వ ద్వారా మళ్లించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ యువకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post