జిల్లా ఆసుపత్రికి దాతల సహకారంతో 18 వీల్‌చైర్లు
రోగుల రవాణాకు మరింత సౌకర్యం
మెడికల్ సూపర్డెంట్ డాక్టర్.టి.ఉషారాణి
నాగర్‌కర్నూల్, జనవరి 22 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం దాతల సహకారంతో 18 అధునాతన వీల్‌చైర్లను బుధవారం అందజేశారు. ఈ వీల్‌చైర్లను ఆసుపత్రికి అందజేసినట్లు మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి.ఉషారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వారి రవాణా అవసరాలకు వీల్‌చైర్లు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా అత్యవసర సేవలు అందించే క్యాజువాలిటీ, ఐసీయూ, ఆర్థోపెడిక్, సర్జరీ, గైనకాలజీ విభాగాల్లో వీటి వినియోగం అధికంగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన సోషల్ రెస్పాన్సిబిలిటీ హైదరాబాద్ టైటాన్స్ రౌండ్ టేబుల్ క్లబ్ ఆధ్వర్యంలో 9 వీల్‌చైర్లు అందజేయగా, ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ వి.శేఖర్ 5 వీల్‌చైర్లు, ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ ఏ.మహేష్, డాక్టర్ రాజు తదితరులు కలిసి మరో 4 వీల్‌చైర్లు దానం చేసినట్లు ఆమె వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దాతలు, వైద్యులు చూపిన సేవాభావానికి పలువురు ప్రశంసలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్, సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ డాక్టర్ రవిశంకర్, ఆర్‌ఎంఓ డాక్టర్ ఏ.రోహిత్, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ నరహరి, డాక్టర్ శ్రీకాంత్, హెల్ప్‌డెస్క్ ఇన్‌చార్జ్ టి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

