ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయం
2026 క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్. రాజేష్ రెడ్డి
నాగర్‌కర్నూల్, జనవరి 21 (మనఊరు ప్రతినిధి):
తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాగర్‌కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంగళవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అందరూ అంకితభావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెల సమయానికి వేతనాలు చెల్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు వంకేశ్వరం నిరంజన్, జిల్లా అధ్యక్షులు రాంచందర్ జి., వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రయ్య, ఉపాధ్యక్షులు గుంపుల నరేష్, ట్రెజరర్ సందీప్, రాజశేఖర్, జనరల్ సెక్రెటరీ శ్రీను, నిరంజన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బంగారయ్యతో పాటు ఈ భూపతి కృష్ణ సాగర్, జయప్రకాష్, బాలస్వామి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
